రామ్‌చరణ్‌కి కరోనా…ఆందోళనలో మెగా అభిమానులు

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:కరోనా చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది.క‌రోనా మ‌హ‌మ్మారి ఉదృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. సామాన్యుల‌నే కాక సెల‌బ్రిటీల‌ని సైతం ఇది వ‌ణికిస్తుంది. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు క‌రోనా సోకిన‌ట్టు ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. క‌రోనా ల‌క్ష‌ణాలు ఏవి లేవు. గ‌త కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసి వాళ్లు ప‌రీక్ష‌లు చేయించుకోండి. త్వ‌ర‌లోనే కోలుకొని శ‌క్తివంతంగా మీ ముందుకు వ‌స్తాను అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.

చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్ర షూటింగ్ పూర్త‌వుతుంద‌ని అనుకునే క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా సోక‌డం చిత్ర బృందాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.