అల్లుడు అదుర్స్ హీరో బెల్లంకొండ సాయి కాశ్మీర్ లో చిక్కుకపోయారు. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా సాయి, హీరోయిన్ నభ, ఇంకా టీమ్ అంతా అక్కడ వుండిపోయింది.ఫ్లయిట్ లు లేవు. స్పెషల్ ఫ్లయిట్ కు కూడా అవకాశం లేదు. సినిమాలో ఓ పాట చిత్రీకరణ కోసం కాశ్మీర్, లఢఖ్ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.ఎప్పుడయితే హీరో, హీరోయిన్లు అక్కడ చిక్కకుపోయారో, సినిమా ప్రమోషన్లకు గండి పడింది. సినిమా నెల 15న విడుదల కావాల్సి వుంది.సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను శుక్రవారం ప్లాన్ చేస్తున్నారు. ఆ వేళకు అయినా హీరో రావడానికి అవకాశం వుంటుందో, వుండదో అని అనుకుంటున్నారు.సుబ్రహ్మణ్యం నిర్మించిన అల్లుడు అదుర్స్ కు సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. నభా నటేష్. అను ఇమ్మాన్యుయేల్, మోనాల్ గుజ్జర్, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
