వెబ్‌ సిరీస్ లో హన్సిక

ఓటీటీ వేదికలు పాపులర్‌ కావడంతో స్టార్స్‌ అందరూ వెబ్‌ సిరీస్‌లు, షోల బాట పట్టిన సంగతి తెలిసిందే. హన్సిక కూడా ఓ వెబ్‌ సిరీస్‌ చేశారు. ఆ సిరీస్‌ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుందని తెలిసింది. ‘పిల్ల జమీందార్, భాగమతి’ ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. హన్సిక లీడ్‌ రోల్‌ చేసిన ఈ సిరీస్‌కు ‘నషా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని సమాచారం. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే సిరీస్‌ ఇది. యూత్‌ఫుల్‌ కథతో పది ఎపిసోడ్లుగా ఈ సిరీస్‌ని రూపొందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ షో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమ్‌ కానుంది.