ప్రేమకు కుల,మత,వృత్తి,వ్యాపారాలతో సంబంధం ఉండదు.ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ఓ నటి ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆయనతో ఆ కుర్ర హీరోయిన్ కి గత కొంతకాలంగా పరిచయం ఉన్నట్టు,ఆపరిచయమే ప్రేమగా మారినట్టు వినికిడి.
నలబై ఐదేళ్ళు దాటిన ఓ రాజకీయ నాయకుడితో కుర్ర హీరోయిన్ సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.ఒక దశలో పెళ్లి ఆలోచన కూడా చేశారని,ఈ నిర్ణయం ఇప్పుడే అంత బాగుండదనే ఉద్దేశ్యంతో బంధాన్ని అలా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.
వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కొన్ని గాసిప్పులు వినిపిస్తున్నాయి,ఇంకా కొంతకాలం వారి ప్రేమాయణం అలాగే కొనసాగిస్తారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.