గోపీచంద్ సరసన టిక్ టాక్ భామ?

మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో యువి-గీతా నిర్మించే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. వన్స్ సినిమా స్టార్ట్ కావాలే కానీ జెట్ స్పీడులో వుంటుంది మారుతి వ్యవహారం. సమ్మర్ కు సినిమా రెడీ చేసేయగలరు. అయితే ఇంతకీ గోపీచంద్ సరసన హీరోయిన్ ఎవరు అన్నది క్వశను. ఇదే ప్రాజెక్టు రవితేజ తో అనుకున్నపుడు చాలా పేర్లు పరిశీలించారు. రాశీఖన్నాను మళ్లీ రిపీట్ చేద్దాం అని కూడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం అవన్నీ పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. 18 నుంచి 20 కోట్ల లోపు బడ్జెట్ లో ఈ సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మారుతి రెమ్యూనిరేషన్ ఓ ఆరు కోట్లు.గోపీచంద్ కు యువితో ఎలాగూ మొహమాటం వుంది. అందువల్ల అక్కడ అంత సమస్య వుండదు. సో, మిగిలిన చోట్ల వీలయినంత బడ్జెట్ లో వెళ్లిపోవాలి. అందుకే కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ రంగానికి చెందిన ఓ అమ్మాయిని ఇప్పటికే ప్రోబబుల్స్ జాబితాలోకి చేర్చినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి టిక్ టాక్ లు గట్రా చేసి బాగానే పాపులర్ అయినట్లు తెలుస్తోంది.  ఆ జాబితాలో వున్న ఇద్దరి ముగ్గురిని ఫొటో షూట్ చేసి, ఒకరని త్వరలో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.