గోపీచంద్ కొత్త‌ సినిమా

పక్కా కమర్షియల్‌ అనే మాటను సినిమాల్లో తరచూ వింటూనే ఉంటాం. అంటే.. సినిమా పక్కా కమర్షియల్‌ అని అర్థం. తాజాగా ఇదే టైటిల్‌ను ఫిక్స్‌ చేసుకున్నారట మారుతి. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారట. గీతా ఆర్ట్స్‌ బ్యానర్స్‌ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. మారుతి సినిమాల్లో హీరోలకు ఓ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. ఆ విధంగా తాజా సినిమాలో హీరో పక్కా కమర్షియల్‌ మైండ్‌ సెట్‌ ఉన్నవాడని కూడా ఊహించవచ్చు.