పూజా హెగ్డే అభిమానులకు గుడ్‌ న్యూస్

పూజా హెగ్డే అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న పూజా తాజాగా కోలుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ‘మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. స్టుపిడ్‌ కరోనాను తన్నేశాను. నెగిటివ్‌ వచ్చింది. మీరు చూపించిన ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది’ అంటూ పూజా ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌ చేసింది. అందరూ జాగ్రత్గా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించింది.

ఇక ప్రస్తుతం ఈ బుట్టబుమ్మ చేతిలో పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో చిరంజీవితో ఆచార్య, మహేష్‌ బాబుతో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ, ప్రభాస్ సరసన పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అక్కినేని అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ ఖాన్‌ సినిమా రాధేలో చాన్స్‌ కొట్టేసిన సంగతి తెలిసిందే. అటు తమిళంలోనూ సూపర్‌ స్టార్‌ విజయ్‌ సరసన సినిమాలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది ఈ భామ. ప్రస్తుతం పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే మూవీ షూటింగుల్లో పాల్గొననుంది.