ప్రముఖ అస్ట్రాలజర్ బాలు మున్నంగి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ దర్శకులు లక్ష్మణ్

అమెరికా అధ్యక్షుడు కుటుంబంతో టచ్ లో ఉన్న బాలు మున్నంగి గారిని  సినీ దర్శకుడు లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిసి తన తదుపరి చిత్ర విశేషాల గురించి ప్రస్తావించడం జరిగింది, దలైలామా గారితో సాన్నిత్యం కలిగిన బాలు మున్నంగీ గారు అంబానీ గారి కుటుంబం, సంజయ్ దత్, అజయ్ దేవగన్, లాంటి ప్రముఖులకు ఆస్ట్రాలజీ సలహాలు చెప్పే ప్రముఖ వ్యక్తి.

ఈ సృష్టిలోని ప్రతి అణువణువు దివ్యశక్తితోనే నడుస్తుంది. అదే విధంగా మన మనసులో వచ్చిన ఆలోచనను విజయవంతంగా అమలు చేయడంలో మన చుట్టూ ఉండే వారే కాకుండా ఆయా పరిస్థితుల సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే కలిగే ఆలోచనలు మాత్రం కేవలం కర్మను బట్టి ఉంటాయనేది వాస్తవం. మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఏవీ యాదృచ్ఛికం కావు. ప్రతీది ముందుగానే నిర్ణయించబడుతుంది. అది మన అరచేతి రేఖలో నిక్షిప్తం అయి ఉంటుంది. ఒక మనిషి తాను తయారు చేసే వస్తువు పనిచేయడానికి ఎలా మాన్యువల్ ఇస్తాడో, ఆ భగవంతుడు మనిషికి అందచేసిన మాన్యువల్…. అరచేతిలోని రేఖలు. వీటిని చదవడం వల్లనే ఆయా వ్యక్తి బలం, బలహీనతనలు, అదృష్ణ.. దురదృష్టాలు. జీవితంలో ఎలాంటి పరిస్థితులకు గురవుతాడో తెలియజేస్తుంటాయి. ఈ అరచేతి రేఖలను తెలిపే శాస్త్రమే పామిస్ట్రీ. గత 20 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ (జ్యోతిష్యం), పామిస్ట్రీ ( హస్తసాముద్రికం), న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) లో నిత్యం పరిశోధనలు చేస్తూ తనదైన ప్రత్యేక శైలి ఏర్పర్చుకొని భూత, భవిష్యత్, వర్తమానాలను అత్యంత కచ్చితంగా చెప్పడంలో నైపుణ్యం సంపాదించారు బాలు మున్నంగి.

ఇప్పటివరకు ఎందరో అంతర్జాతీయ, జాతీయ సెలెబ్రిటీలు ఆయన వద్ద జ్యోతిష్యం చెప్పించుకొని నివారణ మార్గాలను సైతం తెలుసుకొని సక్సెస్ అయ్యారు. బాలు పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని మున్నంగి అనే పల్లెటూర్లో అయినప్పటికీ… హస్త సాముద్రికంపై మక్కువతో దానిలోని లోతు (డెప్త్)ను అందుకోవాలన్న ఒకే ఒక్క పట్టుదలతో… విశేష పరిశోధనలు చేసి ఘనాపాటిగా నిలిచారు. అందుకే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబ సభ్యుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అరచేతిలో ఉన్న రేఖలు, దాని ఆకారం (షేప్) , రంగు, చేతి వేళ్ల పొడుగు మొదలగువాటిని పరిశీలించి జరిగిపోయిన సంఘటనలు, జరిగేవి సైతం కచ్చితంగా చెప్పగలుగుతారు బాలు. కాకపోతే పుట్టిన సమయం, తేది మాత్రం తప్పనిసరి. ఇవి కచ్చితంగా ఉంటే తాను ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు, వివాహం, చివరకు మరణ తేదీని సైతం స్పష్టంగా చెప్పగలుగుతారు.