రెండో వివాహం చేసుకున్న కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు

ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ కె.రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు క‌నికా థిల్లాస్ తాజాగా త‌న‌కిష్ట‌మైన వ్య‌క్తితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ ర‌చ‌యిత హిమాన్షు శ‌ర్మ‌తో కొంత కాలంగా ప్రేమాయ‌ణం సాగిస్తున్న క‌నికా థిల్లాస్ తాజాగా వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా త‌న సోష‌ల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్ పెట్టారామె.కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్ర‌యాణం అని త‌మ పెళ్లికి సంబంధించి కామెంట్ పెట్ట‌డం విశేషం. ఇద్ద‌రూ సినీ ర‌చ‌యిత‌లు కావ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. గ‌తంలో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడిని కనికా పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో మ‌నస్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. కానీ రీల్ లైఫ్‌లో మాత్రం క‌లిసి ప‌ని చేయ‌డం విశేషం.  కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ ‘జ‌డ్జిమెంట‌ల్ హై క్యా’ చిత్రానికి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, క‌నికా క‌థ‌ను అందించారు.  కాగా క‌నికా థిల్లాస్‌,  హిమాన్షు శ‌ర్మ వివాహం  చాలా నిరాడంబ‌రంగా జ‌రిగింది. కోవిడ్ నేప‌థ్యంలో ఈ వేడుక‌లో  ఇరు కుటుం బాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన్నారు.  నవ దంపతులకు నటి తాప్సీ, మంచు లక్ష్మీతో పాటు  పలువురు ప్రముఖులు  శుభాకాంక్షలు తెలిపారు.