దిల్ రాజుకు అరుదైన ఘనత

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నేడు అరుదైన ఘనత చేశాడు. ఒకే రోజు తన ఐదు సినిమాలు షూటింగ్ జరుపుకోవడంతో దిల్ రాజు అరుదైన నిర్మాతల జాబితాలో స్థానం సంపాదించాడు. ఈ ఏడాది సినిమా చిత్రీకరణలో చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. కానీ దిల్ రాజు మంచి జోరులో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇతర నిర్మాతలు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకే రోజు ఒకే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఐదు సినిమాలు షూటింగ్‌లు జరుపుకోవడం చాలా అరుదు. అయితే నేడు ఆ అరుదైన ఘనతను దిల్ రాజు సాధించాడు. ఒకే రోజు ఐదు సినిమాలు షూటింగ్ జరగడంతో దిల్ రాజు నేడు చాలా బిజీగా ఉన్నాడు. అయితే అవి ఏం సినిమాలో ఓ లుక్కేయండి.. బాలీవుడ్ పింక్ రీమేక్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్, ఎఫ్2 సీక్వెల్‌గా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఎఫ్3, నాగచైతన్యా హీరోగా చేస్తున్న థాంక్యూ, పాగల్, హుషారు దర్శకుడితో కొత్త సినిమా ఈ ఐదు సినిమాలు నేడు షూటింగ్ జరుపుకున్నాయి.ఈ ఐదు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమాలో కాకుండా మరికొన్ని చర్చల దశలో కూడా ఉన్నాయి.