సైనికుడి పాత్రలో దేవరకొండ

సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని ప్రకటించారు కూడా. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్‌. విజయ్‌ దేవరకొండ సైనికుడి పాత్రలో నటించనున్నారని సమాచారం.