ఓటీటీ లో ‘డియర్‌ మేఘ’ సినిమా

‘కథ కంచికి మనం ఇంటికి’, ‘డియర్‌ మేఘ’ అంటున్నారు హీరో అదిత్‌ అరుణ్‌. ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్స్‌ ఇవి. మంగళవారం అదిత్‌ అరుణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా డబుల్‌ ధమాకాలా ఈ రెండు చిత్రాల లుక్స్‌ని విడుదల చేశారు. ‘కథ కంచికి మనం ఇంటికి’లో అదిత్‌ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటించారు. నూతన దర్శకుడు చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్‌ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘మా హీరో అదిత్‌ అరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మా చిత్రం మొదటి లుక్, మోషన్‌ పోస్టర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు మోనిష్‌ పత్తిపాటి.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుభాష్‌ డేవాబత్తిన, లైన్‌ ప్రొడ్యూసర్‌: కుమార్‌ కోట, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: వైయస్‌ కృష్ణ. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఈ సినిమా నేరుగా ఇంటికే రానుంది. ‘మా సినిమాని త్వరలో ఓ బిగ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నాం’’ అని అర్జున్‌ దాస్యన్‌ అన్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగితం అందించారు.