డార్లింగ్‌‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ని త్వరగా ముగించాలని తీవ్రంగా కృషి​ చేస్తున్న చిత్ర యూనిట్‌కి డార్లింగ్‌ ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. సినిమా కోసం పని చేస్తున్న వారందరికీ చేతి వాచ్‌లు ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ వాచ్‌లకు సంబంధించిన ఫొటోలను ప్రభాస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్‌ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం.. ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా, కేజీఎఫ్‌ దర్శకుడితో సలార్‌ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈరోజు ‘సలార్’‌ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది.