పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సలార్. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..తన పాత్ర షూటింగ్ లో నేడే జాయిన్ అయిందట. బైక్ మెకానిక్ షెడ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రభాస్-శృతిహాసన్ పై వచ్చే సన్నివేశాలను ప్రశాంత్ నీల్ అండ్ టీం చిత్రీకరిస్తున్నట్టు టాక్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి బరిలో కలెక్షన్ల సునామిని సృష్టించి..విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న శృతిహాసన్ వెంటనే ప్రభాస్ తో కలిసి షూటింగ్ లో జాయిన్ అయింది.
