కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఇటు తెలుగు అటు తమిళ భాషలలో ప్రేక్షకదారణ పొందాడు. ఇప్పుడు సుల్తాన్ అనే ఇంట్రెస్టింగ్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. మూడేళ్ళ క్రితం సుల్తాన్ సినిమా కథ విన్న కార్తీ ఈ సినిమాపై చాలా ఆసక్తికనబరుస్తున్నాడు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో రశ్మిక తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సాయంత్రం 5 గం.లకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.