కృతి శెట్టికి మరో క్రేజీ ఆఫర్‌

ఒక్క సినిమాతో కుర్రకారు దృష్టిని తనవైపుకు తిప్పుకుంది మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతోనే బోలెడంత క్రేజ్‌ను సంపాదించుకుంది. నిజానికి సినిమా రిలీజ్‌​ అవడానికి ముందే ఆమె టాలీవుడ్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. సినిమా ప్రోమో, సాంగ్స్‌లో కృతీని చూసిన యువత ఆమె అందం, అభినయానికి మంత్రముగ్ధులయ్యారు. అటు దర్శకనిర్మాతలు కూడా ఆమె కాల్షీట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారంటే ఆమె క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. తాజా అప్‌డేట్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టిని సంప్రదించినట్లు టాక్. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్‌ చేసిన కృతిశెట్టి అన్న సాయి ధరమ్ ప్రాజెక్టుకు సున్నితంగా నో చెప్పినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.