నిర్మాత యాదా కృష్ణ కన్నుమూత

హీరో, నిర్మాత యాదా కృష్ణ(61) కన్నుమూశారు. బుధవారం ఆయన గుండెపోటులో మృతి చెందారు. యాదా కృష్ణ 20పై పైగా చిత్రాల్లో నటించారు. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ వంటి బి గ్రేడ్ సినిమాల హీరోగా ఒకప్పుడు ఒక తరహా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న యాదా కృష్ణ.

ఆ తర్వాత సంక్రాంతి అల్లుడు అనే ఫ్యామిలీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న యాదా కృష్ణ కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. కొన్నిచిత్రాలను స్వయంగా నిర్మించారు. యాదా కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.