హైదరాబాద్,తీస్మార్ న్యూస్:సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు గెస్ట్‌గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఆయన దుప్పటికప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భం గురించి వివరించారు. ఇది విన్న అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. మేటర్‌లోకి వెళితే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి ‘సామ్ జామ్’ షోలో పాల్గొనగా, అందులో ఆయన తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయాల మొదలైన అంశాలపై మనసు విప్పి మాట్లాడారు.”గెలిస్తే పొంగిపోను, ఓడితే కుంగిపోను” అని చెప్పిన చిరంజీవి.. తన జీవితంలో ఓ సారి కుమిలికుమిలి ఏడ్చిన సందర్భం గురించి చెప్పారు. తన కెరీర్‌ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రం 1983లో రిలీజ్ కాగా, ఈ సినిమా మెగాస్టార్‌కు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మరోసారి అదే కాంబినేషన్‌లో వేట అనే సినిమా వచ్చింది. 1986లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ప్లాఫ్ అయింది. దీంతో ఆ బాధను తట్టుకోలేక దుప్పటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చినట్టు చిరు పేర్కొన్నారు. ఆ బాధ నుండి బయట పడడానికి తనకు చాలా సమయం పట్టిందని మెగాస్టార్ స్పష్టం చేశారు.
