ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా..కొమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. రామోజీఫిలిం సిటీలో ప్రధాన భాగం షూటింగ్ జరుపుకుంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్ (చిన్నప్పటి పాత్ర)చేస్తున్నాడు. ధృవన్ ఫేస్‌బుక్ పేజీలో అతని లుక్ ఒకటి పోస్ట్ చేసి..అతడు ఆర్ఆర్ఆర్ లో భాగం..క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.అయితే ఈ బుడతడు భీమ్‌గా కనిపిస్తాడా..? సీతారామ రాజుగా కనిపిస్తాడా అన్నది మాత్రం చెప్పలేదు. స్టిల్ ను చూసిన నెటిజన్లు మాత్రం ఈ లుక్ ఖచ్చితంగా జూనియర్ భీమ్ దేనంటూ కన్ఫామ్ చేస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమ్రం భీమ్, అల్లూరి చిన్ననాటి పాత్రలను కూడా చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ 160 నిమిషాలపాటు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మొర్రిస్, అజయ్ దేవ్‌గన్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్‌చేస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. 2021 అక్టోబర్ 13న విడుదల కానుంది.
