2020 లో వివాహం చేసుకున్న సెలబ్రిటీలు వీళ్ళే

సినిమాలు లేక‌, సెల‌బ్రిటీల సంద‌డి లేక దిగాలుగా ఉన్న అభిమానుల‌కు  ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న సెల‌బ్స్ పెళ్లి పీట‌లెక్క‌డం కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింద‌నే చెప్పాలి. క‌రోనా కాలంలో త‌మ ప్రియ‌సఖిని పెళ్ళి చేసుకొని ఈ ఇయ‌ర్‌ని కాస్త స్పెష‌ల్‌గా మార్చుకున్నారు కొంద‌రు సినీ సెల‌బ్రిటీస్.  ఇందులో కొంద‌రు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోగా, మ‌రి కొంద‌రు పెద్ద‌లు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నారు. ఈ ఏడాది ముగుస్తున్న క్ర‌మంలో 2020 పెళ్ళి పీట‌లెక్కిన సెల‌బ్రిటీల వివ‌రాలు మీ కోసం..!

దిల్ రాజు: పెళ్ళి తేదీ మే 10.. భార్య పేరు తేజస్వి..

నిఖిల్ సిద్ధార్థ్: పెళ్లి తేదీ మే 14.. భార్య పేరు డాక్టర్ పల్లవి వర్మ

నితిన్: పెళ్లి తేదీ జులై 26.. భార్య పేరు షాలిని

సుజీత్‌.. పెళ్లి తేది ఆగ‌స్ట్ 2.. భార్య పేరు ప్ర‌వ‌ల్లిక‌

రానా దగ్గుబాటి: పెళ్లి తేదీ ఆగస్ట్ 8.. భార్య పేరు మిహీక బజాజ్

కాజల్ అగర్వాల్: పెళ్లి తేదీ అక్టోబర్ 30.. భర్త పేరు గౌతమ్ కిచ్లు

సింగర్ నేహా కక్కర్: పెళ్లి తేదీ అక్టోబర్ 24.. భర్త పేరు రోహన్ ప్రీత్ సింగ్

సింగర్ ఆదిత్య నారాయణ్: పెళ్లి తేదీ డిసెంబర్ 1.. నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్య పేరు శ్వేతా అగర్వాల్

నిహారిక‌.. పెళ్లి తేది డిసెంబర్ 9.. భ‌ర్త పేరు చైతన్య

బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్: పెళ్లి తేదీ డిసెంబర్ 25.. కాబోయే భర్త పేరు జైద్ దర్బార్

బాలీవుడ్ టీవీ నటుడు షహీర్ షైక్: పెళ్లి ఫిబ్రవరి 2021.. నిశ్చితార్థం జరిగింది.. కాబోయే భార్య పేరు రుచిక కపూర్

 

ఇక జబర్ధస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ కూడా లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్నాడు. అతడితో పాటు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ కూడా వివాహమాడాడు. ప్పుడు ప‌లు సినిమాల‌లో విల‌న్‌గా న‌టిస్తూ అల‌రిస్తూ వ‌స్తున్న క‌బీర్ సింగ్.. పాపులర్ పంజాబీ సింగర్ అయిన డాలీ సింధుతో ఏడ‌డుగులు వేసాడ‌ని స‌మాచారం.