ఈ రోజుల్లో, బస్‌స్టాప్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది వరంగల్ భామ ఆనంది. ఈ చిత్రాలు ఆనందికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరి పెండ్లి పీటలెక్కింది. తమిళ కోడైరెక్టర్ సోక్రటిస్-ఆనంది వివాహబంధంతో ఒక్కటయ్యారు. వరంగల్ లోని కన్వెన్షన్ సెంటర్ లో బంధువులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆనంది వివాహవేడుక జరిగింది.బస్ స్టాప్ చిత్రం తర్వాత ఆనందికి గ్లామరస్ రోల్స్ వస్తుండటంతో కోలీవుడ్ పై ఫోకస్ పెట్టి మంచి హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది. సోక్రటిస్ ప్రస్తుతం అగ్ని సిరాగుగల్ చిత్రానికి కోడైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆనంది కోలీవుడ్ లో త్రిష, నయనతార, మారి సెల్వరాజ్ వంటి స్టార్ యాక్టర్లతో నటించి తమిళ ప్రేక్షకులను మెప్పించింది. ఆనంది సుదీర్ఘ విరామం తర్వాత తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న జాంబిరెడ్డి చిత్రంలో ఫీమేల్ లీడ్ చేస్తుంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి డైరెక్టర్.
