బిగ్ బాస్ 4 నాగార్జున రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక వైపు కరోనా పంజా విసురుతుంటే కూడా బిగ్ బాస్ షోను దిగ్విజయంగా 106 రోజుల పాటు పూర్తి చేసారు నిర్వాహకులు. ఎన్నో రోజులుగా ఎంటర్టైన్మెంట్ పంచిన ఈ షో డిసెంబర్ 20న ముగిసింది. సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 20 వరకు 106 రోజుల పాటు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ అందించారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వాళ్లతో పాటు వారం వారం నాగార్జున కూడా వచ్చి రచ్చ చేసాడు. మధ్యలో కొన్నిసార్లు కామెడీ చేసాడు.. మరికొన్నిసార్లు సీరియస్ అయ్యాడు.. ఇంకొన్ని సార్లు కంటెస్టెంట్స్ కు కునుకు లేకుండా చేసాడు. అలా ప్రతీవారం తనదైన ముద్ర వేసుకుంటూనే వచ్చాడు నాగార్జున. మధ్యలో కొన్నిసార్లు విమర్శల పాలయ్యాడు కూడా.అలా అన్నిరకాల ఎమోషన్స్ బిగ్ బాస్ హోస్టింగ్ లో చూపించి మంచి మార్కులు వేయించుకున్నాడు ఈయన. ముఖ్యంగా కుమార్ సాయి, దేవి నాగవల్లి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ షో మధ్యలోనే అన్యాయంగా ఎలిమినేట్ అయినపుడు కూడా నాగ్ ఏం చేయలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. వాళ్లకు ఓట్ల గురించి కాకుండా కావాలనే బయటికి పంపించేసారని అప్పట్లో విమర్శలు బాగానే వచ్చాయి. అప్పటికీ నాగార్జున మాట్లాడలేదని..పైగా ఓట్లతోనే అంతా జరుగుతుందని మళ్లీ మళ్లీ చెప్పాడు నాగార్జున.15 వారాలు 30 ఎపిసోడ్స్‌కు కానూ నాగార్జున దాదాపు 8 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఎన్టీఆర్ ఈయన కంటే భారీగా అందుకున్నాడు. అప్పుడు ఈయన 16 ఎపిసోడ్లకే అప్పట్లో 8 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాని కూడా 7 కోట్ల వరకు తీసుకున్నాడు. ఇప్పుడు కోవిడ్ టైమ్ లో నాగార్జున హోస్టింగ్ చేసి 8 కోట్ల వరకు అందుకున్నాడు. గత సీజన్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే అందుకున్నాడు ఈయన. ఏదేమైనా ఎన్ని విమర్శలు వచ్చినా బిగ్ బాస్ 4 మాత్రం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చివరికి వచ్చేసరికి రేటింగ్స్ పరంగా బాగానే ఉంది బిగ్ బాస్.