బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో తెలుగులో సీజన్ 5 జరుపుకోనుంది. ఆగస్ట్‌లో సీజన్ 5 ప్రారంభం కానున్నట్టు తెలుస్తుండగా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారు నిర్వాహకులు. తొలి కంటెస్టెంట్ గా సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇతనికి సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సెలక్ట్ చేశారని అంటున్నారు. షణ్ముఖ్ జస్వంత్‌కు యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఎంపికై త్వరలోనే క్లారిటీ రానుంది. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీజన్ 5 కంటెస్టెంట్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంచెం పాపులర్ వ్యక్తులనే ఈ సీజన్‌కు తీసుకురావాలని భావిస్తున్నారు. సీజన్ 5ని కూడా నాగార్జుననే హోస్ట్ చేయనుండగా, ఎలిమినేట్ అయిన వాళ్ళను సోహెల్ ఇంటర్వ్యూ చేయనున్నట్టు సమాచారం.