బాహుబలిలో కట్టప్ప ఎత్తుకున్న చిన్న పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం బాహుబ‌లి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నక వ‌ర్షం కురిపించ‌డ‌మే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ బాహుబ‌లిగా క‌నిపిస్తే, రానా భ‌ళ్ళాదేవుడుగా , ర‌మ్య‌కృష్ణ శివ‌గామిగా, అనుష్క దేవ‌సేనగా‌, స‌త్య‌రాజ్ క‌ట్ట‌ప్పగా, త‌మ‌న్నా అవంతిక పాత్ర‌ల‌లో కనిపించి మెప్పించారు. బాహుబ‌లి తొలి పార్ట్‌లో శివ‌గామి త‌న చేతిలో ఉన్న‌ చిన్నారిని నీటిలో మున‌గ‌కుండా పైకి లేపి తుది శ్వాస విడుస్తుంది.  ఆ చిన్నారి ఏడుపులు విన్న గిరిజ‌నులు మాహిష్మ‌తి రాజ్యానికి చెందిన వార‌సుడిని  ర‌క్షించి ఆల‌నా పాల‌నా చూసుకుంటారు. అయితే ఆ చిన్నారిని చిన్న‌ప్ప‌టి ప్ర‌భాస్‌గా మ‌న‌కు చూపించ‌గా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి . మ‌న‌కు బాహుబ‌లి సినిమాలో చాలా నెల‌ల పిల్ల‌గా చూపించ‌గా, ఇప్పుడు ఆమె చాలా పెద్ద‌గైంది.ప్ర‌స్తుతం ఆమె ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.