అర్జిత్‌ సింగ్‌ తల్లి కన్నుమూత

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ ఇంట విషాదం నెలకొంది. అర్జిత్‌సింగ్‌ తల్లి కోవిడ్‌తో గురువారం కన్నుమూశారు. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. దీంతో కోల్‌కతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే రోజురోజుకీ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నేడు ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కాగా రెండు వారాల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరిన విషయాన్ని మొదట నటి స్వస్తిక ముఖర్జీ, నిర్మాత శ్రీజిత్‌ ముఖర్జీ వెల్లడించారు. అర్జిత్‌ తల్లికి ఏ నెగటీవ్‌ బ్లడ్ గ్రూప్ అవసరం ఉందని ఇటీవల తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఆషికి 2 సినిమాలోని పాటలు అర్జిత్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అర్జిత్‌ పాడిన ‘తుమ్ హాయ్ హో’ అనే పాట అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఇవే కాక ఎన్నో పాటలకు తన మధుర గాత్రాన్ని అందించాడు.