హీరోయిన్‌కి కోపం తెప్పించిన ఫొటో

సెల‌బ్రిటీలు ఎప్పుడే మూడ్‌లో ఉంటారో అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. అన్నీ బాగుంటే సంబ‌రంగా ఉంటారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా కోపంతో ఎదుటి వాళ్ల‌పై చిందులేస్తారు. చివ‌రికి త‌మ అభిమానుల‌ను కూడా విడిచిపెట్టారు. తాజాగా హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌కు కోపం వ‌చ్చింది. హీరోయిన్ అనే పాపులారిటీతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణిగా అనుష్క శ‌ర్మ‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.సినీ అభిమానుల‌తో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆమెకు తోడ‌య్యారు. ఇదిలా ఉండ‌గా త‌న భ‌ర్త‌తో క‌లిసి బ‌య‌టికి వెళ్లొచ్చిన అనుష్క …బాల్క‌నీలో కూర్చుని ముచ్చ‌ట్లు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  అయితే ఇక్క‌డే అస‌లు సంగ‌తి ఉంది.స‌ద‌రు ఫొటో త‌మ అనుమ‌తి లేకుండా తీశార‌ని అనుష్క ఫైర్ అయ్యారు. ఫొటో తీయ‌డ‌మే కాకుండా   ప‌బ్లికేష‌న్స్  సంస్థ‌లు వాడుకున్నాయి. దీంతో ఆమెలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుష్క శ‌ర్మ స‌ద‌రు ఫొటోగ్రాఫ‌ర్‌త‌గో పాటు ప‌బ్లికేష‌న్స్‌పై  తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.”ఎన్నిసార్లు చెప్పినా మారరా? మీరు పదేపదే మా గోప్యతకు భంగం కలిగిస్తూనే ఉన్నారు. ఇక చాలు, ఇలాంటివి వెంట‌నే నిలిపేయండి ” అని ఆమె ఘాటుగా హెచ్చరించారు. అనుష్క శ‌ర్మ ఆగ్ర‌హంపై సోష‌ల్ మీడియాలో భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి అమ్మ‌డికి ఓ ఫొటో కోపం తెప్పించిందన్న మాట‌.