పశ్చిమ గోదావరి జిల్లాలో అనుష్క

ప్రముఖ హీరోయిన్‌ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలుతో అనుష్క ఇక్కడకు వచ్చారు. పడవలో గోదావరిలో ప్రయాణించిన వీరంతా మాస్క్‌లు ధరించి ఉండటంతో వీరిని స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. కాగా అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే.