తమన్నా పాటకి ప్రముఖ నటి ఫిధా

తమన్నా.. ఈ పేరు వింటేనే ఓ పాలరాతి బొమ్మ కళ్ల ముందు కదలాడుతుంది. అంతటి అందం తమ్మన్నా సొంతం. తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా దుసుకెళ్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకటేశ్‌ సరసన ఎఫ్‌3, గోపిచంద్‌తో సిటీమార్‌, నితిన్‌తో ‘అంధా ధున్‌’ తెలుగు రీమేక్‌, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇన్ని రోజులు తన నటన, డాన్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ భామ.. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తనలో దాగిఉన్న సింగర్‌ని సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టింది.

హృతిక్ రోష‌న్, ప్రీతి జింటా న‌టించిన మిష‌న్ క‌శ్మీర్ చిత్రంలోని సోచే కే జీలోన్ పాట‌ను పాడి, ఆ వీడియని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బెంగ‌ళూరులో ఉన్న వాతావ‌ర‌ణం త‌న‌కు ఇలా ఉంద‌ంటూ తమన్నా.. ఆ పాటను ఆలపించింది. ప్రస్తుతం తమన్నా సాంగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తమన్నా గాత్రానికి నెటిజన్లు వందకు వంద మార్కులు వేస్తున్నారు. హీరోయిన్‌ అనుష్క శెట్టి కూడా మిల్కీబ్యూటీ సాంగ్‌కి ఫిదా అయింది. ల‌వ్ సింబ‌ల్‌తో పాటు, హ‌గ్ ఎమోజీని కామెంట్‌గా పెట్టింది. కాగా, తమన్నా తెలుగు సినిమాలతో పాటు హిందీలో భోలే చూడియాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇక వీటితో పాటు తెలుగులో త‌మ‌న్నా.. క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మిలో న‌టించింది. ఈ మూవీ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.