న‌గ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజ‌న్.. షేర్ చేసిన యాంకర్ శ్రీముఖి

బుల్లితెర గ్లామ‌రస్ క్వీన్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ అమ్మ‌డు యాంక‌ర్‌గా అల‌రిస్తున్న స‌మ‌యంలో బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో హౌజ్‌లోకి వెళ్లింది. చివ‌రి వ‌ర‌కు ఉన్న శ్రీముఖి ర‌న్న‌ర‌ప్‌గా హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి స్టైలే మారింది. హీటెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ యువ‌త కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గోవా టూర్‌కు వెళ్ళిన స‌మ‌యంలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

త‌న అభిమాన గ‌ణాన్ని పెంచుకునేందుకు శ్రీముఖి నెటిజ‌న్స్‌తో త‌ర‌చు చాట్ చేస్తూ వారిని అల‌రిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజ‌న్స్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. మీరు ఏ ఫొటోలు అడిగిన పంపిస్తాను అడ‌గండి అనే స‌రికి అభిమానులు కూడా రెచ్చిపోయారు. అంద‌రు అడుగుతున్న ఫొటోలు పంపుతున్న స‌మ‌యంలో ఓ నెటిజ‌న్ న‌గ్నంగా ఉన్న ఫొటో పంపాల‌ని కోరాడు. దీనికి చాక చ‌క్యంగా స్పందించిన శ్రీముఖి ..  నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపించేసింది. దీంతో సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగిపోయింది. ఈ అమ్మ‌డు సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుల్లితెరపైనే కాదు వెండితెర‌పై స‌త్తా చాటుతున్న శ్రీముఖి త్వ‌ర‌లో క్రేజీ అంకుల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.