ప్రముఖ యాంకర్‌ తండ్రి కన్నుమూత

ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ(65) కన్నుమూశారు. గత కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రదీప్‌కు కరోనా వచ్చిందని, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా పాటిజివ్‌పై ప్రదీప్‌ మాత్రం స్పందించలేదు.

ఇక పాండు రంగ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కరోనాతో మృతి చెందాడా లేదా ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్‌.. ఇటీవల హీరోగా కూడా మారాడు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మం‍చి వసూళ్లను రాబట్టింది.