నవ్వులు చిందిస్తోన్న అనసూయ

టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. యాంకర్‌గా కొనసాగుతూనే.. సినిమాల్లో కూడా నటిస్తున్నారు అనసూయ. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. తమిళ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి నవ్వులు చిందిస్తోన్న ఫోటోని షేర్‌ చేశారు అనసూయ. ‘బాండింగ్‌ విత్‌ బ్రిలియన్స్‌.. నిజంగానే మక్కల్‌ సెల్వన్’‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా చిత్రం రాబోతుందా.. అసలు వీరిద్దరు ఎక్కడ కలిశారు.. ఏ చిత్రం కోసం అంటూ అభిమానులు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.

అయితే దీని గురించి మాత్రం ఎలాంటి వివరణ లేదు. ఒకవేళ విజయ్‌సేతపతి చిత్రంలో అనసూయ నటిస్తే.. అభిమానులకు పండగే. ఇక సినిమాల విషయాని​కి వస్తే ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ చిత్రంలో నటిస్తున్నారు. అలానే ‘పుష్ప’, ‘ఆచార్య’ చిత్రాల్లో కూడా అనసూయ చాన్స్‌ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.