ఆగస్టు 13న అల్లు అర్జున్ పుష్ప

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా పుష్ప. ఈ సినిమా మీద భయంకరమైన అంచనాలు వున్నాయి. అటవీ నేపథ్యంలో సుకుమార్ డిఫరెంట్ స్టోరీ తో రూపొందిస్తున్న సినిమా ఇది.ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్ షెడ్యూలు వుంటుంది. దాని తరువాత కేరళ షెడ్యూలు వుండే అవకాశం వుంది. ఇదిలా వుంటే అన్ని సినిమాలకు ముందుగా డేట్ లు బ్లాక్ చేస్తున్నట్లే పుష్ప సినిమాకు కూడా డేట్ బ్లాక్ చేస్తున్నారు.ఆగస్టు 13న విడుదల అంటూ డేట్ ప్రకటిస్తున్నారు. అయితే ఆ టైమ్ కు రెడీ అవుతుందా? కాదా? అన్నది తెలియదు. పైగా సుకుమార్ సినిమా ఇంత ఫాస్ట్ గా సినిమాను రెడీ చేస్తారా? అన్నది అనుమానం. అయితే బన్నీ మాత్రం ఈ సినిమాను వీలయినంత ఫాస్ట్ గా రెడీ చేసి, కొరటాల శివ సినిమా మీదకు వెళ్లాలనే ఆలోచనలో వున్నారు. అందువల్ల సుకుమార్ కు ఓ డెడ్ లైన్ పెడితే తప్ప పని జరగదని ఇలా ప్రకటించేస్తున్నారేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Allu Arjun on Thursday revealed the release date of his upcoming film, Pushpa. The movie is set to open in cinemas on August 13, 2021.“#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP (sic),” wrote Allu Arjun on his Twitter page.Pushpa marks Allu Arjun’s reunion with director Sukumar and composer Devi Sri Prasad.The trio has earlier delivered two blockbuster movies: Arya and Arya 2. It is noteworthy that it is Arya that turned Allu Arjun into an overnight sensation.Along with the announcement, Allu Arjun also shared a captivating poster. It is clear that Sukumar has taken the style out of the ‘Stylish Star’ in this movie.Allu Arjun is seen in an unkempt and rugged avatar as a woodcutter wielding his axe.