అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ ఎంట్రీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ ఎంట్రీపై ఓ కొత్త వార్త మీడియాలో షికార్లు చేస్తోంది. విలక్షణ సినిమాల దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా యాక్షన్‌ డ్రామా లేదా రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కనుందంట. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కబోతుందంట. సికిందర్‌, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నట్లు అల్లు అర్జున్‌ గతంలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన ఓ కార్యక్రమం కూడా చెన్నైలో జరిగింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. తర్వాత అల్లు అర్జున్‌ కోలివుడ్‌ ఎంట్రీపై చాలా వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజంకాలేదు. అయితే అల్లు అర్జున్‌ మాత్రం కోలివుడ్‌ ఎంట్రీపై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాలీవుడ్‌, కోలీవుడ్‌లలో మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉన్న బన్నీ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారనున్నారు.