అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్

టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. మర్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బుల్లితెర యాంకర్‌ అనసూయ భరధ్వాజ్‌ స్పెషల్‌ సాంగ్‌లో అలరించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో‌ భాగం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో నిర్వహించే ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ‌ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ రాబోతున్నట్లు సమాచారం. కాగా సినిమా నిర్మాత బన్నివాస్‌ అల్లు అర్జున్‌కు ఇష్టమైన మిత్రుడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బన్నీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు రానున్నట్లు టాక్‌.

ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎవరు అతిథిగా వస్తున్నారనే దానిపై హీరో, హీరోయిన్‌ ఇతర నటులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఇందులో ఆయన వస్తున్నాడా.. నిజంగా ఒప్పుకున్నాడా.. అయినా ఫ్యాన్స్‌ కోసం ఏమైనా చేస్తాడులే.. ఇప్పుడు సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ సాధించినట్లు అనిపిస్తుందని వీరంతా ఎగ్జాయిట్‌గా ఫీల్‌ అవుతున్నారు.

మరోవైపు నా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన వస్తున్నాడు. AA.. ఊహే చాలా బాగుందంటూ హీరో కార్తీకేయ ట్వీట్‌ చేశాడు. దీంతో అల్లు అర్జున్‌ రావడం ఖాయమని తెలుస్తోంది. ఇక చాల రోజులుగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న కార్తీకేయకు ఈ సినిమా కీలకంగా మారనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరుగబోతుంది. ఇంకేముందీ.. బన్నీ అడుగుపెట్టాక సినిమాపై హైప్ పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లు అర్జున్‌ రాక కార్తికేయకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.