ఆ లిస్ట్‌లో ఉన్న అక్షయ్‌ కుమార్‌

సినిమాలు, బ్రాండ్‌ ప్రమోషన్లు అంటూ అక్షయ్‌ కుమార్‌ ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉంటారు. ఆయన సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. బాలీవుడ్‌ స్టార్స్‌లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లో అక్షయ్‌ పేరు ఎప్పుడూ ఉంటుంది. ఏ స్టార్‌ సంపాదన ఎంత? టాప్‌ టెన్‌ ఎవరు? అంటూ ఫోర్బ్స్‌ మేగజీన్‌ ప్రతీ ఏడాది సర్వే నిర్వహిస్తూనే ఉంటుంది.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్జిస్తున్న 100 సెలబ్రిటీలు అంటూ ఓ జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. ఈ జాబితాలో ఆయనది 52వ స్థానం. 2020కిగాను అక్షయ్‌ సంపాదన సుమారు 48.5 మిలియన్‌ డాలర్లు. అంటే 356 కోట్లు. ఈ జాబితాలో అమెరికా మేకప్‌ దిగ్గజం, రియాలిటీ టీవీ స్టార్‌ కైలీ జెన్నర్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆమె సంపాదన 590 మిలియన్‌ డాలర్లు.