#RRR…అజ‌య్ దేవ్‌‌గ‌న్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఈ ఇద్ద‌రు హీరోల గురువుగా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌‌గ‌న్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా ఇవాళ అజ‌య్ దేవ్‌‌గ‌న్ పుట్టిన రోజు(ఏప్రిల్ 2) కావ‌డంతో.. ఆర్ఆర్ఆర్ లో అజ‌య్ దేవ్‌‌గ‌న్ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో లోడ్, ఎయిమ్, షూట్ అంటూ ఉద్వేగ‌పూరితంగా సౌండ్ ఇచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్‌,రామ్‌చరణ్, ఒలివియా, ఆలియాభట్‌ ఫస్ట్‌లుక్‌లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.