ఆదిపురుష్‌పై క్రేజీ అప్‌డేట్…

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా రామాయణం కథాంశంతో రూపొంద‌నుంది. చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర‌లో మెర‌వ‌నున్నారు. 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో గ్రాఫిక్స్‌ భారీ రేంజ్‌లో ఉండనున్నాయి. ఈ క్రమంలో గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.2022 ఆగష్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. జ‌న‌వ‌రి 19న మోషన్ క్యాప్చ‌ర్‌తో ఆదిపురుష్ సినిమా మొద‌లు కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా కోసం స‌రికొత్త టెక్నాల‌జీ ఉప‌యోగిస్తున్న‌ట్టు  నిర్మాత‌లు  భూషణ్ కుమార్, కృషన్ కుమార్  చెబుతున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్తాయిలో సినిమాని చిత్రీక‌రించేందుకు ఓం అత‌ని టీం పని చేస్తున్నార‌ని, ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఫిబ్ర‌వరి 2 నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.