ప్ర‌ముఖ న‌టుడు రాజీవ్‌క‌పూర్ ఇక‌లేరు

ముంబై: ఒక‌ప్ప‌టి బాలీవుడ్ బాద్ షా, దివంగ‌త‌ రాజ్‌క‌పూర్ త‌న‌యుడు, ప్ర‌ముఖ న‌టుడు రాజీవ్‌క‌పూర్ (58) ఇక‌లేరు. ఈ విష‌యాన్ని రాజీవ్ క‌పూర్ కుటుంబ‌స‌భ్యురాలు నీతూ క‌పూర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు నీతూ క‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాజీవ్‌క‌పూర్ ఫొటోను షేర్‌చేశారు. దానికింద రిప్ అని కామెంట్ పెట్టారు. అయితే, రాజీవ్ క‌పూర్ మ‌ర‌ణానికిగ‌ల కార‌ణాల‌ను ఆమె వెల్ల‌డించ‌లేదు. దివంగ‌త రిషి క‌పూర్‌, రణ‌దీర్ క‌పూర్‌లు రాజీవ్ క‌పూర్ సోద‌రులు.

రాజీవ్ క‌పూర్ త‌న కెరీలో రామ్ తేరీ గంగా మైలీ, మేరా సాథీ, హ‌మ్ తో చ‌లే ప‌ర్దేశీ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించారు. 1991లో హెన్నా అనే సినిమా ద్వారా నిర్మాత‌గా కూడా మారారు. అంతేకాదు, రాజీవ్ క‌పూర్ కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా కూడా పనిచేశారు. ఆ త‌ర్వాత దాదాపు 28 ఏండ్లు సినిమా రంగానికి దూరంగా ఉన్న‌ రాజీవ్‌క‌పూర్ ఇటీవ‌ల సెట్స్ మీదికి వ‌చ్చిన అశుతోష్ గొవారిక‌ర్ సినిమా తుల‌సీదాస్ జూనియ‌ర్ ద్వారా సినీ ఫీల్డ్‌లోకి పునఃప్ర‌వేశం చేశారు.