ఆ హీరో అప్పులు50 కోట్లు?

హీరోలు అంటే డబ్బున్న మారాజులు అనుకోవడం కామన్. ఎందుకంటే కష్టాలు అన్నీ నిర్మాతలకు వుంటాయి తప్ప హీరోలకు కాదు కదా? కానీ హీరోలు కూడా సినిమా నిర్మాణంలోకి వస్తే మాత్రం అప్పుడు తెలుస్తుంది అసలు మజా. నిర్మాతల కష్టాలు..అప్పుల బాధలు అన్నీ అనుభవంలోకి వస్తాయి. తెలుగు-తమిళ భాషల్లో సదా సినిమాలు చేసే హీరో ఒకరి పరిస్థితి ఇలాంటిదే అని తెలుస్తోంది. ఆయనకు సుమారు యాభై కోట్లకు పైగా అప్పులు వున్నాయని తెలుస్తోంది. రకరకాల కారణాల వల్ల ఆ హీరో అప్పుల పాలయినట్లు బోగట్టా. చేసిన అప్పులు కొంత, వాటిపై వడ్డీలు మరి కొంత ఇలా పెరిగి పెరిగి యాభై కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. కొందరయితే యాభై కాదు 70 నుంచి 80 కోట్ల మేరకు వుంటాయని కూడా అంటున్నారు.పోనీ  చకచకా సినిమాలు చేసి నాలుగు డబ్బలు తెచ్చుకుని తీర్చేద్దామా అంటే అలా తీసేవారు కూడా ఎక్కువగా లేరు. మళ్లీ తనే చేతులు కాల్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు గట్టెక్కుతాడో ఆ హీరో?