టాలీవుడ్ లో రెడీ అవుతున్న పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ మీదనే దృష్టి పెట్టాయి. ఆర్ఆర్ఆర్ అటు 2021 దసరాకు వస్తుందో,. లేదా 2022 సంక్రాంతికి వస్తుందో అన్నది ఇప్పటికి అయితే క్లారిటీ లేదు. ఇప్పటికే మొదలైన బన్నీ పుష్ప, అలాగే మొదలు కావాల్సిన త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా, పవన్ ఎకె రీమేక్, మహేష్ సర్కారు వారి పాట వుండనే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీలయినంత వరకు వాటికన్నా ముందుగానే తమ సినిమాలు విడుదల చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో పలువురు హీరోలు, నిర్మాతలు వున్నారు. లేదూ అంటే డేట్ లు దొరకక ఇబ్బంది పడాలి.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇప్పటికే ఏప్రిల్ పస్ట్ వీక్ కు రావాలని ఫిక్స్ అయింది. ప్రభాస్ రాథేశ్వామ్ ను కూడా ఏప్రిల్ ఆఖరు వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. బాలయ్య-బోయపాటిల సినిమా కూడా త్వరగా రెడీ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అది కూడా సమ్మర్ కు వచ్చేస్తుంది. వెంకీ నారప్ప కూడా సమ్మర్ స్లాట్ కోసం వెదుకుతోంది. దాంతో పాటు రానా విరాటపర్వం సినిమా కూడా సమ్మర్ లో డేట్ కావాలి.నాగ్ చైతన్య లవ్ స్టోరీ మార్చి ఆఖరులో కానీ ఏప్రిల్ లో కానీ రావాలని ఆలోచనలో వుంది ఉప్పెన ఐఢియా కూడా ఇదే. ఈ రెండు సినిమాల డేట్ లు చూసుకుని అఖిల్ బ్యాచులర్ డేట్ ఫిక్స్ చేస్తారు. పూరి జగన్నాధ్ సినిమాకు యూరప్, అమెరికా లోకేషన్లు ఇప్పట్లో దొరికేలా లేవు. దానికి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. లోకేషన్ ఏం చేయాలన్నది ఫిక్స్ అయితే షూటింగ్ చకచకానడిచిపోతుంది. కానీ లొకేషన్ నే ఆ సినిమాకు పెద్ద సమస్య.మొత్తం మీద ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు 12 వారాలు అనుకుంటే, పన్నెండు సినిమాలు పక్కాగా రెడీ అయిపోయి, రెడీ అయిపోతూ వున్నాయి. ఇంచుమించి ప్రతివారం ఓ పెద్ద సినిమా వుండే పరిస్థితి కనిపిస్తోంది. మెగాస్టార్ ఆచార్య పోస్ట్ సమ్మర్ లో విడుదలవుతుందని టాక్.
