మహబూబాబాద్, తీస్మార్ న్యూస్: జిల్లాలోని కొల్లాపురం గ్రామంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిన్నింటి సుధాకర్, ఎంపీటీసీ గుర్రం కవిత వెంకన్న తో పాటుగా వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు
Category: Telangana
మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు
లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. కాగా, కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో...
లాక్‌డౌన్ పొడిగింపు
కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు బుధవారం (ఈ నెల 9) వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం...
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్పే డాడీ గొంతు కొద్దిరోజులుగా వినిపించట్లేదు. అల్లరి చేస్తే.. వారించే మమ్మీ కనిపించట్లేదు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్న తిరిగి రాలేదు. గేటు చప్పుడు అయినప్పుడల్లా అమ్మానాన్న వచ్చారన్న సంబరంతో పరిగెత్తుకెళ్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రుల మరణవార్త తెలియకపోవడంతో ‘అమ్మా, నాన్న ఎక్కడ’అంటూ ప్రశ్నిస్తున్నారు. రేపు వస్తారంటూ బంధువులు చెప్పే మాటలు నమ్మి ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా పురాణిపేటకు చెందిన వనమాల నాగరాజు(38) బెంగళూరు లోని ఓ కంపెనీలో ఉద్యోగం...
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61,053 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 16 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,660 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,37,522 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 35,042యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,50,89,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో...
సమర్థవంతంగా లాక్‌డౌన్
ప్రతి ఒక్కరి సహకారంతో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారని, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘20 వేల మందికి ఈ పాసులు జారీ చేశాం. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. కోవిడ్ కట్టడిని అడ్డుకునేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు...
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కోరలు
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కోరలు చాస్తోంది. కరోనా నుంచి బయటపడ్డామన్న సంతోషాన్ని దూరం చేస్తూ ఎందరో జీవితాలను నాశనం చేస్తోంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో చాలామంది ‘బ్లాక్ ఫంగస్’ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ‘బ్లాక్ ఫంగస్’ నోడల్ కేంద్రమైన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు ఆస్పత్రికి...
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
కరోనా వేళ పోలీసులు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి పగలు, రాత్రి పని చేస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా పంజాగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేశ్‌కుమార్ మానవత్వానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కానిస్టేబుల్ మహేశ్ ఆదివారం రాత్రి 11గంటకు సోమాజిగూడలో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో రోడ్డుపక్కన ఇద్దరు చిన్నారులు ఆహారం కోసం యాచించడం చూసి చలించిపోయాడు....
తల్లి శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ
మహబూబాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కరోనాతో తల్లి చనిపోతే ఆమె శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ వేశాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతను ముందుకు రాకపోవడంతో కోడలు రంగంలోకి దిగడం గమనార్హం. పీపీఈ కిట్లు ధరించి ఆమె అత్తగారి మృతదేహాన్ని అంత్యక్రియలకు మరో మహిళతో కలిసి సిద్ధం చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా...
లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు
లాక్‌డౌన్‌ను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు, వాహనదారులు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నా కొందరు హెచ్చరికలను పట్టించుకోకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. సోమవారం మలక్‌పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ప్రధాన రహదారులపై లాక్‌డౌన్ ఉన్నా అవేమీ తమకు పట్టవన్నట్లు ప్రజలు రోడ్లపై తమ వాహనాలతో తిరిగారు. కొందరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాగా, యువత తమ స్నేహితులను కలిసేందుకు బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న పాత మందుల చిట్టీలను...