ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో సిరీస్ఆడటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ఆడి నేరుగా టెస్ట్ క్రికెట్ ఆడాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కోహ్లీ సేనకు ఖచ్చితంగా ప్రతికూలతే అని వివరించాడు. మ్యాచ్‌కు ముందు 8 నుంచి 10 ప్రాక్టీస్ సెషన్లు ఉన్నా, మ్యాచ్ ప్రాక్టీస్‌కు ఇవి ప్రత్యామ్నాయం కాలేవని తెలిపాడు. ఏదిఏమైనప్పటికీ ఫైనల్స్‌లో టీమిండియా...
Category: Sports
కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి, తన బ్యాటింగ్ శైలి వేర్వేరు అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అభిప్రాయడ్డాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని, అలాంటి దిగ్గజంతో తనను పోల్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని వెల్లడించాడు. అయితే, వ్యక్తిగతంగా తనకు పోలికలంటే ఇష్టముండదని, ముఖ్యంగా కోహ్లీ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడితో పోలిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌పై మూడు శతకాలు చేయడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని,...
వివాదంలో కోహ్లీ-అనుష్క దంపతులు
సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారంపై మీడియా చొరవతో జనాలకు ఆసక్తి పెరగడం.. అదే టైంలో తమ ప్రైవసీని గౌరవించండంటూ సెలబ్రిటీలు రిక్వెస్టులు చేస్తుండడం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కోహ్లీ-అనుష్క విషయంలో ఇలాంటి వివాదమే ఒకటి చెలరేగింది. కూతురి ముఖం మీడియా కంటపడకుండా అనుష్క జాగ్రత్త పడగా.. కొందరు ఆమె తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఫొటోజర్నలిస్టుల తీరుపైనా సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్ కోసం ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్,...
కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయి
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు తానెప్పుడూ డుమ్మా కొట్టాలని అనుకోనని భారత మహిళల టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. సమాజంలో మీడియా ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి క్రీడారంగానికి చెందిన వారందరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. క్రీడారంగానికి చెందిన వారెవరికైనా క్వారంటైన్‌లో గడపడం కష్టమేనని, ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాక ఆ కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయని ఒసాకాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మహిళా క్రికెట్...
కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ పర్యటన
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయర్స్.. తమ తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఉండేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అక్కడే స్టే...
సుశీల్ కుమార్ ఆర్మ్స్ లైసెన్స్ రద్దు
ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్‌ను (ఆర్మ్స్ లైసెన్స్) రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు ప్రక్రియను లైసెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించినట్టు తెలిపారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం సుశీల్ కుమార్‌ను హరిద్వార్ తీసుకెళ్లి.విచారిస్తున్నారు.సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. సుశీల్ కుమార్ 18 రోజుల పాటు...
ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న ధోని
టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని మరో ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తన స్వస్థలం రాంచీలో విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్న ఈ ఝార్ఖండ్ డైనమైట్.. ఇటీవలే ముంబైలో ఓ విల్లాను, తాజాగా పూణేలోని పింప్రి-చిన్చ్వాడ్‌లో ఓ నూతన భవంతిని హస్తగతం చేసుకున్నాడు. పూణేలో రియల్ ఎస్టేట్‌కు మంచి డిమాండ్ ఉండటంతో రావేట్‌లోని ఎస్టాడో ప్రెసిడెన్షియల్ సొసైటీలో అతను నూతన భవంతి నిర్మాణాన్ని చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను కొద్దిరోజుల కిందట...
రైనాకు సుదీప్ అంటే ప్రాణం
సురేశ్ రైనా.. టీమిండియా తరపున 15 ఏళ్ల పాటు(2005-2020) అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరుపొందిన రైనా టీమిండియాకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. అంతేగాక రైనాలో మంచి ఫీల్డర్ ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రైనాకు ఆటతో పాటు సినిమాలంటే కూడా ఇష్టమని చాలా ఇంటర్య్వూల్లో పేర్కొన్నాడు. అయితే తాను ఒక్క హీరోను మాత్రమే ఇష్టపడతానని.. అతని సినిమాలు తప్ప వేరేవి చూడడని కొన్ని సందర్భాల్లో...
నిండు ప్రాణాన్ని కాపాడిన కోహ్లి దంపతులు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లు విలువ చేసే ఖరీదైన మందు కోసం నిధులు సమకూర్చారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు.. తాజాగా ఆయాన్ష్ గుప్తా అనే ఓ చిన్నారికి పరోక్షంగా ప్రాణదాతలుగా నిలిచి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి...
క్రికెటర్ భువీ తండ్రి కన్నుమూత
టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్(63) క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం కన్నుముశారు.ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న భువీ తండ్రి ఇంటికి తిరిగివచ్చారు. కాగా కిరణ్ పాల్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడినుంచి ముజఫర్‌నగర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి షిప్ట్ చేయగా.. చికిత్స తీసుకుంటూ నేడు సాయంత్రం మృతి...