హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు మంత్రి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ టీకా ట్రయల్స్ లో భాగంగా టీకాను వేయించుకున్నారు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్.వాస్తవానికి నవంబర్ 20వ తేదీన మంత్రి కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిటల్‌లో జరిగిన మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్.. వాలంటీర్ రూపంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్...
బల్ధియా పీఠం గులాబీ సొంతం
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించింది.శుక్రవారం జరిగిన కౌంటింగ్ లో తెరాస 56,బీ.జే.పీ 48,ఎం.ఐ.ఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి.అతిపెద్ద పార్టీగా నిలిచిన టీ.ఆర్.ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠ 150 డివిజన్లకు 30 సర్కిళ్లలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. ప్రత్యర్థుల మధ్య పోల్ అయిన ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో...
కారు జోరు…
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస దూసుకుపోతుంది.యూసఫ్ గూడ, మెట్టుగూడ లో తెరాస విజయం సాధించింది.మరికాసేపట్లలో మొదటి రౌండ్ పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం కాప్రాలో టీఆర్ఎస్...
బల్ధియా ఫలితాల లైవ్ అప్డేట్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటగా మెహదీపట్నం డివిజన్, చివరగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలపై ఒక స్పష్టత రానుంది. సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలు.. మలక్ పేట సర్కిల్ మలక్‌పేట 62(బీజేపీ – 36, టీఆర్ఎస్ – 11, కాంగ్రెస్ – 1, ఎంఐఎం – 2, ఇండిపెండెంట్...
బల్ధియా ప్రజా తీర్పెటు?
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:డిసెంబర్ 1 న జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.అధికార తెరాస పార్టీ సెంచరీ కొడుతుందని సర్వేలు చెబుతున్నాయి.ప్రజా తీర్పెలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలి :సీపీ సజ్జనార్
ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి ఎన్నికల కమిషన్‌కు సీపీ సజ్జనార్ సూచన ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలని, అప్పుడే ఓటు విలువ తెలిసి వస్తుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎ్‌సలతో కలిపి భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌లో...
ఓటరన్నా…నీకు మేమున్నామన్నా
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వస్తున్న వృద్ధులకు తెలంగాణ పోలీసులు చేయూతగా నిలిచారు.ఫ్రెండ్లీ పోలీస్ మీకు మా తీస్మార్ న్యూస్ మరియు ఇతర మీడియా మిత్రుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
గ్రేటర్…(నో)ఓటర్
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ కేవలం 24.52 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో 10 శాతం కూడా పోలింగ్ దాటలేదు. *గుడిమల్కార్‌పూర్‌లో అత్యధికంగా 49.19శాతం పోలింగ్ నమోదు కాగా..* *అత్యల్పంగా రెయిన్‌బజార్‌లో అరశాతం (.56)శాతం నమోదయ్యింది.* పోలింగ్ శాతం ఇలా.. కొండాపూర్- 9.98% రాజేంద్రనగర్- 9.90% విజయనగర్ కాలనీ- 9.0 % ఆల్విన్ కాలనీ-...
చరిత్ర పునరావృతం
హైదరాబాద్ ఓటర్లలో అదే నిర్లిప్తత .కారణాలు అవే నా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగర ఓటరు ఈసారీ నిర్లిప్తం వీడలేదు. ఎప్పటిలాగే ఇంటి బయటికొచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు బద్ధకించారు. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును ఉపయోగించడం పట్ల మెట్రో ఓటర్లు అనాసక్తి కనబరిచారు. వరుస సెలవులు, కరోనా భయం ఓటింగ్ తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. చరిత్ర పునరావృతమైంది. ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక...
యువతా మేలుకో…
హైదరాబాద్,తీస్మార్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 30 శాతం ఓట్లు పోలయ్యాయి.ఇప్పటి వరకు ఓట్లు వేసిన వారు పెద్దలు,వృద్ధులు,దివ్యాంగులు,అంధులు వీరి ఓట్లే దాదాపుగా 25 శాతం ఉన్నట్టు తెలుస్తుంది.యువత ఇప్పటికైనా మేలుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి.కొందరు వృద్ధులని అడిగితే చెప్పిన విషయం “ఒక్కసారి ఓటు వేయకపోయినా చచ్చిన శవంతో సమానం” అని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇకనైనా మేలుకోండి ఓటు హక్కు వినియోగించుకోండి సమయం తిరిగిరాదు.