అన్నాడీఎంకేను కైవశం చేసుకోవడం చిన్నమ్మ తరం కాదు అని మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం, కడంబూరురాజు స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాల మీద నేతలు దృష్టి పెట్టారు. ఆయా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, నేతలు ఎవ్వరు జారి పోకుండా ముందు జాగ్రత్తల్లో ఉన్నట్టుంది. ఆ...
Category: Politics
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు. కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు. ఇక పినరయి...
పేషెంట్లను పరామర్శించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. తొలిసారిగా కేసీఆర్ సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. స్వయంగా కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీస్తున్నారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. కరోనా వార్డుల్లో పేషెంట్లను సీఎం కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య...
నారా లోకేశ్‌పై కేసు
మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్‌లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు… టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ.. లోకేశ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ భోజరాజు నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు...
చంద్రబాబు పై కేసు
కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును నమోదుచేశారు. కర్నూలు కేంద్రంగా ఎన్ 440 అనే స్ట్రెయిన్ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారంతో పలువురి చావుకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.చంద్రబాబుపై తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. న్యాయవాది సుబ్బయ్య...
కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అదీకాక కోవిడ్ సోకిన కొంత మంది సీనియర్ రాజకీయ నేతలు మరణించారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు...
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి
తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని, స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్రానికి స్టాలిన్ శాశ్వత ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత మరణం వెనుక ఉన్న నిజాలను స్టాలిన్ నిగ్గుతేల్చుతారని కేతిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ తను అధికారంలోకి వస్తే జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తానని...
పౌరులపై భారం పడుతుందని చెప్పిన నిర్మల సీతారామన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ‘ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల...
కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన కల్వకుంట్ల కవిత కొండగట్టు నుంచి జగిత్యాల...
ముంబై హోటల్‌లో ఎంపీ మృతి
దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో మోహన్ నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాతీలో రాసిన సూసైడ్ నోట్‌ను దేల్కర్ బస చేసిన గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంపీ మోహన్ దేల్కర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ...