ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. మహారాష్ట్రను ఒకరోజు ముందే రుతుపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో...
Category: national
మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,90,89,069కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,219 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,53,528 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో...
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్ కేసులు లక్షకు దిగొచ్చాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,00,636 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్ పాజిటివ్ తేలగా.. 3,49,186 మంది కోవిడ్ బాధితులు తమ ప్రాణాలను...
రామ్‌దేవ్‌బాబాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ హైకోర్టు యోగా గురు రామ్‌దేవ్‌బాబాకు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్ దాఖలు చేసిన దావాపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయం వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కాగా, కొరోనిల్ టాబ్లెట్‌పై రామ్‌దేవ్‌బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ డీఎంఏ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. కొరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా...
నో వ్యాక్సిన్ నో శాలరీ
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ వంటి చర్యలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు చూచిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొంతమంది ఆసక్తి చూపించడం లేదు. అంతేగాక వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు. ఇలాంటి సమయంలో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్...
మలేషియాలో ఘోర రైలు ప్రమాదం
మలేషియాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని కౌలాలంపూర్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.45గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెస్ట్ రన్‌లో భాగంగా వెళ్తున్న ట్రైన్‌లో ఒక డ్రైవర్ మాత్రమే ఉండగా.. మరో రైలు ప్రయాణికులతో వస్తుంది. ఈ క్రమంలో పెట్రోనాస్ టవర్స్‌కు సమీపంలో కంపంగ్ బారు – కేఎల్‌సీసీ స్టేషన్ల మధ్య సొరంగంలో...
వుహాన్ ల్యాబ్‌లో పుట్టిన కరోనా
కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్ ముందు అమెరికా ఉంచిది. కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్ 2019లో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు....
చైనాను కుదిపేస్తున్న భూకంపాలు
వరుసగా చోటు చేసుకుంటున్న భూకంపాలు చైనాను కుదిపేస్తున్నాయి. కొద్దిపాటి విరామంతోనే మళ్లీమళ్లీ భూమి కంపిస్తుండటంతో చైనీయులు ఆందోళన చెందుతున్నారు. భూకంపాల ధాటికి ఇప్పటి వరకు చైనాలో ముగ్గురు చనిపోగా 27 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ఇళ్లు భూకంప తీవ్రతకు దెబ్బ తిన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం నుంచి చైనాలోని దాదాపు 12 కౌంటీల్లో భూమి కంపిస్తోంది. అయితే యంగ్‌బీ, యాంగ్ గౌజాంగ్ కౌంటీలు భూకంపాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టరు స్కేలుపై 5...
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 4, 209 కరోనా బాధితులు మృతి చెందారు.కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,91,331కు చేరింది.దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.12...
టౌటే తుపాను కారణంగా 49 మంది మృతి
భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్ బోట్ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్‌లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున...