ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మంచుకొండను ఢీకొట్టి రెండు ముక్కలైన టైటానిక్ నౌక.. 1912 లో సరిగ్గా ఇదే రోజున మునిగిపోయింది. నౌకలోని దాదాపు 1500 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ నౌక బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. దీని కథను ఆధారంగా చేసుకుని 1997 లో టైటానిక్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ సినిమాలో ఆరోజో జరిగిన ఘటనలను కండ్లకు కట్టినట్లు చూపించారు. టైటానిక్ 20...
Category: International
పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన మారలాగో రిసార్ట్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడి కొత్త జంటకు విష్ చేసి నన్ను మిస్ అవుతున్నారా అని వాళ్లను అడిగారు. పనిలో పనిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ వచ్చి ఆ ప్రశ్న అడగ్గానే అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా ట్రంప్ సన్నిహితులుగా ఉన్న మేగన్ నోడెరర్, జాన్ ఆరిగో పెళ్లి చేసుకున్నారు....
ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
స్పెయిన్‌లోని టెనెరిఫే రన్‌వేపై రెండు బోయింగ్ 747 లు పరస్పరం ఢీకొన్న సంఘటన అత్యంత ఘోర విమాన ప్రమాదంగా చరిత్ర పుట్టల్లో నిలిచిపోయింది. 1997 మార్చి 27 న జరిగిన ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో విమానం పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణిస్తున్న 61 మందిని మాత్రమే రక్షించగలిగారు. కేఎల్‌ఎం ఫ్లైట్ 4805 ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభించగా.. పాన్ అమెరికన్ ఫ్లైట్ 1736 లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం...
డజను మాస్కులు ఆర్డర్ ఇస్తే పన్నెండే వచ్చాయి..నా డబ్బు తిరిగి ఇచ్చేయండి
మిన్నెసొటా: ఇదన్యాయం.. నేను డజను మాస్కులు ఆర్డర్ చేస్తే.. మీరు పన్నెండే పంపించారు. నా డబ్బులు నాకు వాపసు ఇవ్వండి అని ఎవరైనా అంటే మీకు ఏమనిపిస్తుంది. ఏదో జోక్ చేశాడులే అని ఈజీగా తీసుకుంటాం. కానీ అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం చాలా సీరియస్‌గానే ఓ పెద్ద ఈమెయిల్ పంపించాడు. నేను డజను మాస్కులు ఆర్డర్ చేశాను. మీరు మాత్రం 12 మాత్రమే పంపించారు. దయచేసి మిగతావి కూడా పంపండి. ఇక నుంచి మీ బిజినెస్‌కు...
80 లక్షలకే డ్రీమ్ ఐలండ్
లండన్ : మెట్రో నగరాల్లోనే రూ 80 లక్షలకు లగ్జరీ అపార్ట్‌మెంట్లు అందుబాటులో లేని రోజుల్లో దాదాపు అదే మొత్తంతో స్కాట్లాండ్‌లో ఓ ద్వీపానికి యజమాని అయ్యే అవకాశం ముందుకొచ్చింది. ఈ ధరకు ఏకంగా ఓ ఐలాండ్ సొంతమవుతుందే ఎవరూ నమ్మరు. అయితే స్కాట్‌లాండ్‌లో స్ధలం కొనాలని కలలు కనేవారికి మాత్రం ఇది మెరుగైన అవకాశంగా చెబుతున్నారు. స్కాట్లాండ్ తీరంలో ఓ ప్రైవేట్ ద్వీపం రూ 80 లక్షలకే అమ్మకానికి పెట్టారు. స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో 11...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కిమ్ సోదరి వార్నింగ్
ప్యాంగ్యాంగ్: ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కే వార్నింగ్ ఇస్తోంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్. మీకు నిద్ర లేకుండా చేసుకునే చర్యలు దిగొద్దని ఆమె హెచ్చరించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. అధ్యక్షడు కిమ్‌కు ఆమె కీలకమైన సలహాదారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి ఆమె ఇలా అధ్యక్షుడికే హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన జారీ చేసింది. మీరు వచ్చే నాలుగేళ్లు...
టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు..
మనిషి బాధను డబ్బు, కార్లు, బంగ్లాలేవీ పోగొట్టలేవు.. సాటి మనిషి ఓదార్పు తప్ప! కష్ట సమయంలో అండగా నిలబడి నేనున్నా అనే ధైర్యాన్ని కలిగించే ఒక్క మనిషి ఒకరు పక్కన ఉన్నా.. మనసెంతో తేలికపడుతుంది. ఇలాంటి గొప్ప ఓదార్పు అమెరికాలోని ఒక టీచర్‌కు దక్కింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న టీచర్.. బాధను పోగొట్టేందుకు ఓ స్టూడెంట్ రాసిన లేఖ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన టీచర్ మెలిసా మిల్నర్ భర్త.....
గోద్రా మారనహోమానికి 19 ఏండ్లు
2002 ఫిబ్రవరి 27.. భారత చరిత్రలో అతి విషాదమైన రోజు. గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పంటించడంతో 59 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కర సేవకులు. ఈ మత ఉద్రిక్తత గుజరాత్ అంతటా వ్యాపించింది. గోద్రాలోని పాఠశాల, దుకాణాలన్నీ మూసివేసి కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోద్రా మారణహోమం...
నైజీరియాలో 317 మంది విద్యార్థినిలు కిడ్నాప్..
జమ్‌ఫారా: నైజీరియాలోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్న 317 మంది విద్యార్థినిలను దుండగులు అపహరించారు. ఈ ఘటన జమ్‌ఫారా రాష్ట్రంలోని జంగేబి గ్రామంలో జరిగింది. ఆఫ్రికా ఖండంలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో అపహరణలు సర్వసాధారణం అయ్యాయి. విద్యార్థులను ఎత్తుకెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం అక్కడ పరిపాటిగా మారింది. ప్రభుత్వ బాలికల సెకండరీ పాఠశాలలోకి దూసుకువచ్చిన మిలిటెంట్లు .. అక్కడ కాల్పులు జరిపి పిల్లలను తమ వాహనాల్లో తరలించారు. సమీపంలో ఉన్న రుగు అడవుల్లోకి వారిని తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ...
మహిళ గుండె, ఆలుగడ్డతో కూర..
మహిళ గుండెతో కూర చేయడమేంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. ఆ గుండెను ఆలుగడ్డతో కలిపి వంట చేశాడు. దాన్ని మరో ఇద్దరు దంపతులకు వడ్డించి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు నరరూప రాక్షసుడు. ఈ ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓక్లాహామాకు చెందిన లారెన్స్ ఆండర్సన్(42).. తన ఇంటికి సమీపంలోని ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె గుండెను బయటకు తీసి.. తన...
- 1
- 2