క్రైం,తీస్మార్ న్యూస్:సైదాబాద్ ఘటన మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెలితే మంగల్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.స్థానికులని చూసి సుమిత్ అనే నిందితుడు అక్కడ నుండి పరారైన్నట్టు తెలుస్తుంది.పరారీలో ఉన్న నిందుతుడిని అత్తాపూర్ వద్ద లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Category: crime
మృగాడు రాజు ఆత్మహత్య
క్రైం.తీస్మార్ న్యూస్:సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహన్ని గుర్తించారు.మృతుడి చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజు అని నిర్థారించారు.
అనుమానంతో వృద్ధుడి హత్య
మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కే మారేడుబాకలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కే మారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య(65) మే 12 నుంచి కనిపించడం లేదు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు 13న దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ...
చిచ్చుపెట్టిన ఆస్తి వివాదం
ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని...
ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపై ఉన్న జేసీబీని ఢీకొంది. ఆ తీవ్రతకు ఆ జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 17 మంది చనిపోగా ఐదుగురు...
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మృతి
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు.తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే...
భర్తను కాటికి పంపిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య, తన కొడుకు, ప్రియునితో కలిసి భర్తను కాటికి పంపింది. ఈ దారుణం బెళగావి జిల్లా చించోళి వద్ద వెలుగుచూసింది. హతుడు కుమార రాముఖోత (39). అతని భార్య గీతకు బాలేశ అనే వ్యక్తితో సంబంధం ఉండేది. ఇది మానుకోవాలని అనేకసార్లు భర్త హెచ్చరించినా పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడు, కొడుకు సచిన్, మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం గత నెల 27న భర్తకు మద్యం తాగించి బండరాయితో...
పాతబస్తీలో దారుణం
పాతబస్తీలోని డబీర్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్కు, ప్రత్యర్థులైన అజీబ్, ముజీబ్, కమ్రాన్‌లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్‌ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జర్నలిస్టు కన్నుమూత
జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్...
కత్తితో హల్చల్ చేసిన యువకుడు
ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు.. ఇంట్లో ఉందామంటే కుటుంబ కలహాలు.. దీంతో ఆ యువకుడు పిచ్చోడిలా మారాడు. ఎవరిపైనో కోపం.. ఆ కోపాన్ని ఎవరిపై చూపించుకోవాలో తెలియదు. కానీ ఫస్ట్రేషన్ తీవ్రంగా ఉంది. దీంతో చివరకు ఉండబట్టలేక వీధిలోకి వచ్చాడు. వచ్చి రాగానే కనిపించిన వారందరిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. అతడి చేతికి ఆరుమంది బలయ్యారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన చైనాలో జరిగింది.ఈశాన్య చైనాలో హువైనింగ్...