కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా జూన్ 2 వరకు 624 మంది వైద్యులు మృత్యువాత పడ్డారని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) వెల్లడించింది. ఏపీలో 34 మంది, తెలంగాణలో 32 మంది వైద్యులు మృతి చెందారని తెలిపింది. ఈ మేరకు గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది.. బిహార్‌లో 96 మంది, యూపీలో 79 మంది, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించింది. కరోనా ఫస్ట్ వేవ్...
Category: Corona Updates
మే 31 నుంచి లాక్డౌన్ ఎత్తివేత
దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్.జీ అనిల్ బైజల్‌ను కలిసిన తర్వాత మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మే 31 నుంచి...
ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు
కరోనా కట్టడి కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య మందుపై నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. మూడు, నాలుగు రోజుల తర్వాత నివేదక వస్తుంది. సీసీఆర్ఏఎస్ నివేదక వచ్చిన తర్వాత మందు పంపిణీపై...
లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్ పోలీస్ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు...
పెరుగుతున్న కోవిడ్ మరణాలు
భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతిచెందారు. మంగళవారం నాడు 3,55,338 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 చేరింది. మరణాల సంఖ్య 2,54,197కు పెరిగింది. ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ...
సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాలి
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని...
కరోనా వ్యాక్సిన్ వేసుకోండి.. అదొక్కటే మార్గం.. లేదంటే మరో ముప్పు తప్పుదు
కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. యావత్ దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో విజృంభిస్తోంది. వేలకు వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మరి కరోనా కట్టడికి ఉన్న మార్గాలేంటి? వ్యాక్సిన్‌తోనే నిర్మూలించగలమా? లాక్‌డౌన్‌తో అడ్డుకోవాలా? అసలు కోవిడ్ పీడ విరగడవ్వాలంటే ఏం చేయాలి? కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. యావత్ దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో విజృంభిస్తోంది. వేలకు వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మరి కరోనా కట్టడికి ఉన్న మార్గాలేంటి? వ్యాక్సిన్‌తోనే...
కరోనా డేంజర్ బెల్స్..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకున్నారు....
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
పుణె: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రెండున్నర నుంచి మూడు నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని అన్నారు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. నెల రోజుల లోపు ఇస్తే 60 నుంచి 70 శాతం సమర్థంగా పని చేస్తున్న ఈ టీకా.. రెండు నుంచి మూడు నెలల మధ్య ఇస్తే 90 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్...
రాష్ట్రంలో కొత్తగా 1,498 కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో క్రియాశీల కేసులు 10వేలకు...