హైదరాబాద్: సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రయాణికులపై అకస్మాత్‌గా దాడి చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనూహ్యంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.30కి పెంచడమే దీనికి నిదర్శనం. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునేందుకు రైల్వేశాఖ అవకాశం ఇచ్చింది. దీన్ని ఎస్సీఆర్ అధికారులు సావకాశంగా మార్చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30 చేసింది ఎస్సీఆర్. అదే హైదరాబాద్ (నాంపల్లి)...
Category: Business
బ్లాక్ చెయిన్ తంటా..
న్యూఢిల్లీ: టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ యూజర్లకు వాణిజ్య సందేశాల నియంత్రణకు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెలికం కంపెనీలు సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన ఈ కొత్త నిబంధనలతో సోమవారం సాయంత్రానికి దాదాపు 40 శాతం సందేశాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, రైల్వే టికెట్ బుకింగ్, ఈ-కామర్స్, ఆధార్ ధ్రువీకరణ, కొవిన్ దరఖాస్తు వంటి ఆన్‌లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. తత్ఫలితంగా...
ఎక్కువ పాన్‌కార్డులుంటే అంతే సంగతి
న్యూఢిల్లీ: ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకించి బ్యాంక్ ఖాతా తెరవడానికి, వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అత్యంత ముఖ్యమైన పత్రాల్లో పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్). 10-డిజిట్ పాన్ నంబర్‌ను ఆదాయం పన్నుశాఖ కేటాయిస్తుంది. ఆదాయం పన్ను చెల్లింపుదారుడు పాన్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. అయితే దేశీయంతా కొంత మంది ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం బయట పడుతున్నది. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరూ ఒకటి...
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు..
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ రికార్డులు నెలకొల్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నేపథ్యంలో మధ్యాహ్నం 3,32 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 2,314.84 పాయింట్లు దాటి 48,600.61 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ ఏడు శాతం లబ్ధి పొందింది. సెన్సెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 11 శాతానికి పై చిలుకు అత్యధికంగా లాభపడింది. దాని కొనసాగింపుగా ఐసీఐసీఐ బ్యాంకు,...
రంకేసిన బుల్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్, ఆటో, రోడ్ల రంగానికి నిధుల కేటాయింపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టడంతో స్టాక్ మార్కెట్లలో బుల్.. రంకేసింది. సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకే బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1700 పాయింట్లు దాటింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 14,100కు చేరువలో ఉంది. బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ సుమారు 4 శాతం పెరిగాయి.రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు బ్యాంకుల షేర్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. నిఫ్టీ...
వచ్చే ఆరు నెలల్లో హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ, జనవరి 15: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధిమైంది. గతేడాది కరోనా వైరస్ కారణంగా నియామకాలు అంతంత మాత్రమే చేపట్టిన సంస్థ.. వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయంగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తోపాటు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వచ్చే ఆరు నెలల్లో 20 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సీఈవో విజయ కుమార్...
మహిళా సంఘాల ఆర్థిక స్థితి మెరుగు పర్చేలా సహజ బ్రాండ్ :కోప్పుల ఈశ్వర్
మహిళలు అభివృద్ది చెందడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులను మార్చేలా సహజ బ్రాండ్ రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోన్నాల గార్డెన్స్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సహజ బ్రాండ్ ద్వారా SHG ఉత్పత్తుల మార్కేటింగ్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ...
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ
5జీ ల్యాబ్ నెలకొల్పిన మొబైల్ దిగ్గజం చైనా బయట అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం త్వరలో మరో మూడు ప్రయోగశాలలు స్వాగతించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు ఒప్పో కూడా వచ్చేసింది. తెలంగాణలో ఐటీ ప్రాభవాన్ని ఏ కరోనా వైరస్‌లూ.. ఆర్థిక సమస్యలూ అడ్డుకావడంలేదని మరోసారి రుజువైంది. మొన్నటికి మొన్న అమెజాన్.. నిన్న ఫియట్.. ఇవాళ ఒప్పో తన ఇన్నోవేషన్ ప్రయోగశాలను ఏర్పాటు చేయబోతున్నది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రసిద్ధి చెందిన ఒప్పో చైనా వెలుపల తన ల్యాబ్‌ను ఏర్పాటుచేయడానికి...
హైదరాబాద్ లో OPPO భారీ పెట్టుబడులు
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థలతో పాటు ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ వస్తుందని తెలిపారు. ఇది దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అని...
రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
హైదరాబాద్ : జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ఉదయం ప్రారంభించారు. భవన నిర్మాణ వ్యర్థాలకు చెక్ పెట్టేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్లతో కన్‌స్ర్టక్షన్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక, కంకరను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇసుక,...
- 1
- 2