పశ్చిమ గోదావరి,తీస్మార్ న్యూస్:జిల్లాలోని గురుభట్ల గూడెం గ్రామానికి చెందిన మహేష్ బాబు ఉన్నత చదువు కోసం పొలం అమ్మి 20 లక్షలు సిద్ధం చేసుకున్నాడు.భవిష్యత్తు కోసం కలలు కన్న మహేష్ బాబు కి పిడుగుపాటు రూపంలో కన్నీరు మిగిలింది.చదువు కోసం దాచుకున్న డబ్బు కళ్ళ ముందే ఆహుతవుతుంటే ఏమి చేయలేని నిస్సాహయక పరిస్థితి ఆ కుటుంబానికి కన్నీరు మిగిల్చింది.అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా కూడా వారు సరిగ్గా స్పందించలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారు ఆ విద్యార్థి...
Category: Andhra Pradesh
కరోనా పాజిటివ్ కేసులు
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 98,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,768 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,14,261 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 98 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,132కు చేరింది. గడిచిన 24 గంటల్లో 15,612 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 62 వేల 229 మంది డిశ్చార్జ్...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 104 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 18,257 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 46 వేల 617 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 1,46,737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,93,50,008...
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 14,429 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 20,746 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 66 వేల 990 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,90,09,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,80,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24...
రేపు భారత్ బంద్..మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా బంద్ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నేత భూటాసింగ్ తెలిపారు. శాంతియుతంగానే బంద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభావంతంగా ఉంటుందన్నారు. ఈ నెల 28న హోలికా దహనం సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్‌లో మరో 310 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 894044కు చేరింది. ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 884471కు పెరిగింది. ఇవాళ్టి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7191కు చేరింది.
హైకోర్టుకు చంద్రబాబు
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఏపీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ...
అరకు విహరంలో విషాదం
విశాఖ జిల్లా అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా 19మంది గాయపడ్డారు. బస్సు ప్రయాణికులందరూ హైదరాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి అరకు వచ్చి.. తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, బాధితులకు...
పద్మజ అరుపులు-కేకలతో వణికిపోతున్న ఖైదీలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురుషోత్తం, పద్మజ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మదనపల్లె సబ్-జైలులో ఉన్న పద్మజ.. తన ప్రవర్తనతో తోటి మహిళా ఖైదీల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న రాత్రి జరిగిన ఘటనతో మహిళా ఖైదీలంతా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన విచిత్ర ప్రవర్తనతో తోటి ఖైదీలకు విశ్రాంతి లేకుండా చేస్తోందట పద్మజ. శివ..శివ అంటూ గట్టిగా అరవడంతో పాటు కలియుగం అంతమైపోతోందని, ప్రస్తుతం దేవుడికి-రాక్షసులకు...